వరదల్లో మహిళ గల్లంతు

ఆచంట ముచ్చట్లు:


ఆచంట మండలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అధికార యంత్రాం గం మొత్తం లంక గ్రామాల్లో ఉండి పరిస్థితిని  సమీక్షిస్తున్నారు. అయోధ్యలంక, పుచ్చల్లంక, రావిలంక, మర్రిమూల, నక్కిడిలంక, పల్లెపాలెం, పెదమల్లం లంక, ఆనగార లంక, భీమలాపురం, కాపులపాలెంలోని లంక గ్రామాలు నీట  మునిగాయి. రావి లంకలో కొన్ని కుటుంబాల వారు డాబా పైనే ఉండి బిక్కు బిక్కుమంటున్నారు. లంకగ్రామాల్లో  ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ప్రజలు అంతంత మాత్రంగానే వస్తు న్నారు. పెదమల్లం మాచేనమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది.ఈ క్రమంలో వరద ముంపుకు గురైన ప్రాంతంలో దేవి ముత్యాలమ్మ అనే మహిళ గల్లంతు కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

 

Tags: Woman lost in floods

Leave A Reply

Your email address will not be published.