వికారాబాద్లో కలకలం…మహిళ గొంతుకోసి దారుణ హత్య

Date:29/10/2020

వికారాబాద్  ముచ్చట్లు:

వికారాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ పక్కనే ఉన్న నీటి గుంతలో మహిళ శవం లభ్యమయింది. గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి కిరాతకంగా హతమార్చారు. మహిళ హత్య విషయం బయటకు రాగానే స్థానికంగా కలకలం రేగింది.జాతీయ రహదారి పక్కనే ఉన్న నీటి గుంతలో గుర్తు తెలియని వివాహిత మృతదేహం లభ్యమైంది. దుండగులు ఆమె గొంతుకోసి కిరాతకంగా చంపేసి రహదారి పక్కన పడేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని రాకంచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో ప్రధాన రహదారి కల్వర్టు పక్కన గుంతలో వివాహిత మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతుకోసి హత్య చేశారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు  చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

దుబ్బాకలో గెలుపు బీజేపీదే

Tags: Woman strangled to death in Vikarabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *