మహిళ ఆత్మహత్యాయత్నం

రాజమండ్రి ముచ్చట్లు:
 
తూర్పు గోదావరి జిల్లా బెండమూర్లంక రెవెన్యూ గ్రామ పరిధిలో మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గత కొంత కాలంగా కొనసాగుతున్న భూ వివాదంలో సర్వే కి వచ్చిన అధికారులను ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇంతలోనే కొటికలపూడి ప్రసన్న ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె భర్త కొటికలపూడి పాండురంగారావుకు అతని ఐదుగురు అన్నదమ్ములకు మధ్య భూవివాదం కొనసాగుతోంది.  15 ఏళ్ల క్రితం తుమ్మల పల్లి గ్రామ పరిధిలోకి వచ్చే బెండమూర్లంక రెవెన్యూ గ్రామ పరిధిలో ఆకివీడు కి చెందిన ఆరుగురు అన్నదమ్ములు 18 ఎకరాలు కొనుగోలు చేసారు. ఎవరికి వారు వేర్వేరుగా రెండున్నర ఎకరాల చొప్పున అన్నదమ్ములు రిజిస్టర్ చేయించుకున్నారు. గత కొంత కాలంగా కొటికలపూడి పాండురంగారావు ఈ భూములన్నీ చూసుకుంటుండగా తమ భూములు తమకు అప్పగించాలని  మిగిలిన అన్నదమ్ములు అడుగుతున్నట్లు సమాచారం. భూ సర్వే నిర్వహించి తమ భూములు తమకు అప్పగించాలని మిగిలిన ఐదుగురు అన్నదమ్ములు రెవెన్యూ అధికారులు ఆశ్రయించారు. ఇప్పటికే రెండు సార్లు సర్వే నోటీసులు జారీ చేసినా స్వీకరించక పోవడంతో అధికారులు మూడోసారి నేరుగా కొలిచేందుకు ప్రయత్నం చేసారు. ఈ నేపథ్యంలోనే వారిని  పాండురంగారావు అతని భార్య అడ్డుకుంది. ఉన్నపాటుగా ఆమె ఒంటి పై పెట్రోల్ పోసి నిప్పంటించు కోవడంతో  మంటలు చెలరేగాయి. ఆమెను పక్కనే ఉన్న పంట బొదె లోకి ఆమె భర్త త్రోసివేయడం తో  ప్రాణాపాయం తప్పింది గాయపడిన మహిళ ప్రసన్న ను ఆసుపత్రికి తరలించారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags; Woman suicide attempt

Natyam ad