మహిళ దళ కమాండర్ అరెస్టు
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు;
పోలీసులు తనిఖీలలో మావోయిస్ట్ పార్టీకి చెందిన పామేడు ఎల్ఓఎస్ కమాండర్ దొరికిపోయింది. శుక్రవారం నాడు తాలిపేరు డ్యాం వద్ద చర్ల పోలీసులు, 141 సిఆర్పిఎఫ్ బెటాలియన్ సిబ్బంది సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో దళ కమాండర్ కొట్టా బుజ్జి అలియాస్ కమల అలియాస్ @లక్ష్మి ని పట్టుకున్నారు.
కొట్టా బుజ్జిది చత్తీస్గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్పల్లి గ్రామం. ఈమెకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2008 లో మావోయిస్టు మాధవి తన గార్డుగా ఈమెను రిక్రూట్ చేసుకోవడం. జరిగింది. అప్పటినుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ 2015వ సంవత్సరంలో పామేడుఎల్ఓఎస్ S కమాండర్ గా పనిచేయడం ప్రారంభించింది. బుజ్జి నుంచి పేలుడు పధార్ధాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బుజ్జి పామేడ్, కిస్టారం, ఉసూర్, బాసగూడ, తర్రెం పోలీస్ స్టేషన్ల పరిధిలో మరియు తెలంగాణలో చర్చ, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు విధ్వంసకర ఘటనలలో పాల్గోనట్లు పోలీసులు వెల్లడంచారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై దాడులు, సిఆర్పిఎఫ్ క్యాంపులపై తుపాకులతో దాడు లు చేసిన ఘటనలతో పాటు, ఆదీవాసీలను ఇంఫార్మెర్ల నెపంతో హతమార్చిన పలు ఘటనలలో ఈమె కీలకంగా వ్యవహరించిందని పోలీసులు వెల్లడించారు. బుజ్జి పై తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి.

Tags:Woman troop commander arrested
