4 కోట్లు దాటిన మహిళా బ్యాంకు డిపాజిట్లు

Women bank deposits exceeding 4 crores

Women bank deposits exceeding 4 crores

Date:21/05/2018
కర్నూలు ముచ్చట్లు:
చిన్న చిన్న పొదుపుతో ప్రారంభమైన ఈ బ్యాంకులో నేడు రూ. లక్షల్లో టర్నోవర్ చేస్తోంది. వరో వస్తారు..1998వ సంవత్సరంలో మండల కేంద్రమైన మిడుతూరులో ప్రారంభించిన భ్రమరాంభ మహిళా సహకార బ్యాంక్ అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. రాష్ట్రంలోనే ప్రప్రథమ మహిళా బ్యాంకుగా గుర్తింపు పొందిన ఈ బ్యాంకును మహిళలే నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా ఏర్పడిన ఈ బ్యాంకు సభ్యులు నేడు అన్ని రంగాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.ఈ బ్యాంకులో ప్రతి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు డైరెక్టర్‌గా ఉంటారు. ఈ డైరెక్టర్లు అందరూ కలిసి అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులను ఎన్నుకుంటారు. వీరితో పాటు ఏపీఎం, బ్యాంక్ మేనేజర్, క్యాషియర్, క్షేత్రస్థాయి అధికారి, సహాయక సభ్యులు ఉంటారు. వీరు ప్రతి 15రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించి బ్యాంకు పనితీరు, పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల మంజూరు, రుణ వసూలు, ఆదాయ పంపీణీ, తదితర విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రత్యేకంగా మహిళల కోసమే ఏర్పాటైన ఈ బ్యాంకును పరిశీలించేందుకు దేశ, విదేశీ ప్రతినిధులు వచ్చి వెళ్లారు. ప్రస్తుత శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా గతంలో ఈ బ్యాంకును సందర్శించి మహిళలను అభినందించారు. మొదట మహిళలు ప్రతిరోజూ కొంతమొత్తం పొదుపు చేసుకుంటూ వచ్చేవారు. ఈ మొత్తం కొద్ది రోజులకు పెరగడంతో ఆ మొత్తాన్ని మరికొందరికి అప్పుగా ఇచ్చి వసూలు చేసేవారు. ఈ తతంగం చేసేందుకు తామే ఒక బ్యాంకు ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందనే ఆలోచన వచ్చిన వెంటనే మహిళలు బ్యాంకును ఆచరణలోకి తెచ్చారు. మహిళల ఉత్సాహాన్ని చూసిన నాటి టీడీపీ ప్రభుత్వం రూ. 19లక్షల మొత్తాన్ని గ్రాంట్‌గా ఇచ్చింది. అప్పటికే పొదుపు సంఘంలో వున్న రూ. 5.25లక్షలు, గ్రాంట్ మొత్తంతో కలిపి రూ. 24లక్షలతో బ్యాంకు ప్రారంభమైంది. కాగా నేడు ఈ బ్యాంకు రూ. 4కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుండడం విశేషం. ప్రారంభంలో 120 సంఘాలతో వున్న ఈ బ్యాంకులో నేడు 247 పొదుపు సంఘాల మహిళలు అప్రతిహతంగా జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు.
Tags: Women bank deposits exceeding 4 crores

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *