Natyam ad

మహిళల స్వాలంభనకు చేయూత పథకం

కాకినాడ ముచ్చట్లు:

మహిళల ఆర్థిక స్వావలంబనకు, సాధి కారతకు వైఎస్సార్ చేయూత పథకం ఉపయోగపడుతోందని మంత్రి చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కాకినాడలో వైఎస్ఆర్ చేయూత చెక్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథి గా మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నా రు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ కాకినాడ జిల్లాలో వైఎస్సార్ చేయూత మూడో విడత కార్యక్రమం ద్వారా 1,02,335 మంది లబ్ధిదారులకు 191.88 కోట్ల మేర ఆర్థిక సహాయం అందుతున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఏడాదికి 18,750 చొప్పున క్రమం తప్పకుండా వరుసగా నాలుగేళ్లలో 75 వేలు చొప్పున అందించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే రెండు విడతల సాయం అందిందని మూడో విడత సహాయం అందించినట్లు తెలిపారు. మూడు విడతల్లో కలిపి మొత్తం జిల్లాలో లబ్ధిదారులకు 538.47 కోట్ల సహాయం అందినట్లు వివరించారు. కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ తండ్రి ఆశయాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి మహిళలు అందరు అండగా నిలిచి ఆశీర్వాదం అందించా లని కోరారు.అనంతరం రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రప టానికి పాలాభిషేకం నిర్వహిం చారు. అనంతరం మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు.

 

Tags: Women Empowerment Scheme

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.