పుంగనూరులో మహిళలు పేరటికోళ్లు పెంపంకంపై దృష్టి సారించాలి – ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు అసిల్పేరటికోళ్లు పెంపకంపై అవగాహన పెంచుకుని ఆర్థికాభివృద్ధి చెందాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి కోరారు. సోమవారం ఐకెపి ఏపీఎం రవి ఆధ్వర్యంలో పేరటికోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని 150 కుటుంబాలకు చెందిన మహిళలకు పెరటికోళ్లను పంపిణీ చేశామన్నారు. రూ.4 వేలు యూనిట్ ధరగా నిర్ణయించి, ప్రభుత్వం రూ.1000 ల సబ్సిడితో రూ.3 వేల రూపాయల యూనిట్ ధరగా నిర్ణయించి 11 కోళ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందులో నాలుగుపుంజుకోళ్ళు, 7 పెట్టకోళ్లు అందించామన్నారు. అధిక లాభాలు ఇచ్చే అసిలాకోడి నాటుకోళ్ల తరహాలో ఉంటుందని , ఎలాంటి రోగాలకు కోళ్లు నష్టపోవాల్సి ఉండదన్నారు. హైబ్రిడ్ కోళ్లతో పొల్చుకుంటే అధిక బరువు, రుచి కలిగిన అసిలా కోళ్లను మండలంలో మరింతగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన వారు తమ ధరఖాస్తులకు ఐకెపి కార్యాలయంలో అందించాలని త్వరలోనే మిగిలిన వారికి పంపిణీ చేస్తామని ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఈశ్వరమ్మ, ఎంపీడీవో రాజేశ్వరి, వైఎస్సార్సీపీ నాయకులు జయరామిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, బాబు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags; Women in Punganur should focus on raising their reputation – MPP Bhaskar Reddy
