Natyam ad

 మహిళలకు అన్నీ రంగాల్లో భాగస్వామ్యం అవసరం-ఐసిడిసి సూపవైజర్ కవిత రాణి

జగిత్యాల ముచ్చట్లు :
మహిళలకు అన్నీ రంగాల్లో భాగస్వామ్యం కల్పించి ముందుకుతీసుకెళ్లాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జగిత్యాల సూపర్వైజర్ కవిత రాణి అన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి అంగన్వాడికేంద్రంలో లింగ సమానత్వం, మహిళలు, బాలికల హక్కులు, చట్టాల గురించి అవగాహన కార్యక్రమం స్థానిక సర్పంచ్ రత్నమాల శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐసిడిసి సూపర్ వైజర్ కవితారాణిమాట్లాడారు.ఈసందర్బంగా కవితారాణి మాట్లాడుతూ ప్రభుత్వాలు మహిళా సంక్షేమం కోసం పాటుపడుతూనే , మహిళా, బాలికల గురించి ప్రత్యేకమైన చట్టాలు తీసుకువచ్చాయనీ వివరించారు.మహిళలకుసామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో భాగస్వామ్యం కల్పించడంతో పాటు ప్రాముఖ్యత ఇచ్చి ప్రోత్సహించాలన్నారు.
మహిళలు, బాలికలకు ఏదైనా ఆపద,సమస్యలుంటే  టోల్ ఫ్రీ, హెల్ప్ లైన్నంబర్లున్నాయని వీటిని వినియోగించుకోవాలని
కవితరాణి సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శిరీష, పద్మ, భాగ్య, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Women Need Participation in All Fields-ICDC Supervisor Poetry Queen