Women need to be savvy in financial transactions

ఆర్థిక లావాదేవీల్లో మహిళలు అవగాహన కలిగి ఉండాలి

– ఏపీఎం హరికృష్ణారెడ్డి

Date:13/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

మహిళలు ఆర్థిక లావాదేవీల్లో పూర్తి అవగాహన కలిగి ఉండాలని మండల ఏపీఎం హరికృష్ణారెడ్డి పీలుపునిచ్చారు. గురువారం మహిళల సాధికారత మాసోత్సవాలను ఆయన సంఘ మిత్రలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు మహిళల స్వయం సహాయక సంఘాలను సాధికారత వైపు నడిపించడమే ఎస్‌సీహెచ్‌జి సంఘాల లక్ష్యమని తెలిపారు. పేదరిక నిర్మూలన సంస్థ వైఎస్సార్‌ క్రాంతి పథకం ద్వారా మహిళలను అన్ని రకాల అభివృద్ధి పరిచేలా మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు కార్యచరణ ప్రణాళికలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందేందుకు మహిళలు తగిన రీతిలో చైతన్యవంతులుకావాలన్నారు. ముఖ్యంగా పొదుపు సంఘాల ఖాతాలల్లోని డబ్బును తమ అవసరాలకు డ్రా చేయనివ్వకుండ అలాగే ఇన్సూరెన్స్ కట్టమని బ్యాంకు వారు ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై జిల్లా కలెక్టర్‌కు, బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

సచివాల ఉద్యోగులు మున్సిపల్‌ అధికారుల సూచనల మేరకు పని చేయాలి

Tags: Women need to be savvy in financial transactions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *