మహిళలు ఆర్థికంగా ఎదగాలి  

– త్వరలో నగరంలో లబ్ధిదారులకు ఇంటి పట్టాలు
– వై.ఎస్.ఆర్. ఆసరా జగనన్న ప్రభుత్వ లక్ష్యం
-తిరుపతి శాసనసభ్యుడు భూమన
-ఇంటి గడప దగ్గర కే ప్రభుత్వ పథకాలు

Date:16/09/2020

తిరుపతి  ముచ్చట్లు:

వై.ఎస్.ఆర్. ఆసరా వారోత్సవాల్లో భాగంగా ఐదవ   రోజైన బుధవారం నాడు  నగరపాలక సంస్థ పరిధిలోని ముత్యాలరెడ్డి పల్లి కూడలి జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే  భూమన కరుణాకర్ రెడ్డి గారు, నగరపాలక సంస్థ కమిషనర్  గిరీషగారు.  ముందుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే, కమిషనర్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజనుద్దేశించి కమిషనర్, ఎమ్మెల్యే ప్రసంగించారు. అనంతరం లబ్ధిదారులకు అర్హత పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే మహిళ సంఘాలతో కలసి ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, రంగులు చల్లుకుని సంబరాలు చేసుకున్నారు.ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వై.ఎస్.ఆర్ ఆసరా వారోత్సవాలు సంబరాలు పాల్గొన్న అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా ఎదగాలని మా పార్టీ సిద్ధాంతం అని తెలియజేశారు.
గత ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రభుత్వాన్ని అన్ని విధాల అప్పుల పాలు చేసి, అక్క చెల్లెమ్మలకు సైకిల్ లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ఇల్లు కట్టిస్తా అని మొదలగు వాటిని ఇస్తానని నమ్మబలికి ఏమి చేయకుండానే గద్దె దిగి, నేడు మన ప్రభుత్వం వచ్చినాక అన్ని విధాల ఆడబిడ్డలకు లబ్ది చేస్తూవుంటే, ప్రభుత్వం వారు ఇంటి పట్టాలు ఇస్తా ఉంటే కోర్టుకు పోయి అడ్డగించిన చంద్రబాబు, నేడు సీఎంని విమర్శిస్తున్నారని తెలియజేశారు.

 

 

ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక ప్రతి కుటుంబ సభ్యులకు జగనన్న లక్షాధికారి చేయడమే జగనన్న లక్ష్యం, వైయస్ఆర్  ఆసరా సొమ్ము మొదటి విడతలు మన సంఘాలు ఖాతాలకు గత వారం జమ చేయడం జరిగిందని, కరోన కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో కూడా జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి దీని ద్వారా ఆర్థికలబ్ధిని చేకూర్చారు. మహిళల పక్షపాతి జగనన్న, మహిళలకు అండగా నిలుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఈ కార్యక్రమంలో ఎక్కువ భాగం మహిళల పేరుమీదనే ఇస్తూ వారికి ఎక్కువ లబ్ధి చేకూరేలా చేయడం జరుగుతుందని, జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, వైయస్సార్ చేయూత, వైయస్సార్ సినిమా వడ్డీ ఇలా పథకాలు యొక్క లబ్ధిని అక్క చెల్లి ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలియజేశారు,

 

 

 

కమిషనర్ గిరీష మాట్లాడుతూ వై.ఎస్.ఆర్ ఆసరా ప్రతి కుటుంబం ఎదగాలని, వైఎస్ఆర్ ఆసరా మహిళా సంఘాలకు ఖాతాలో జమ చేయడం గత వారం జరిగిందని, రాష్ట్రంలో తన అక్క చెల్లెమ్మలు జీవితాల్లో ఆర్థికంగా  తీసుకురావాలని సీఎం సంకల్పంతో వైయస్సార్ ఆసరా పథకం ద్వారా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, స్వయం సహాయ సంఘాల మహిళలకు ఆర్థికంగా ఎదగాలని తెలియజేశారు, తిరుపతి నగరంలో ఆడపడుచులకు త్వరలో ఇంటి పట్టాలు ఇస్తామని, ఇప్పటికే నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రతి కుటుంబం ప్రభుత్వం వారు నిర్వహించే కార్యక్రమం లబ్ధి పొందాలని ఈ సందర్భంగా కమిషనర్ తెలియజేశారు.ఈ సమావేశంలో తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి వారితో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్యోతి, నగర పాలక సంస్థ అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎస్. కె. బాబు, ముద్ర నారాయణ, రాజేంద్ర, శ్రీదేవి, మెప్మా అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

ఇలా గుంపులుగా ఉంటే కరోనా రాదా ?      

Tags:Women need to grow financially

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *