మహిళా పోలీస్ అధికారులు వృత్తి ప్రావీణ్యం పెంపొందించుకోవాలి

-మహిళా సంబంధిత సమస్యలపై చొరవ చూపాలి
-పోలీస్ శాఖ పట్ల ప్రజలలో నమ్మకం, గౌరవం పెంచడంలో మహిళా అధికారులదే కీలకపాత్ర
సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అన్ని అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలి
– జిల్లా ఎస్పీ  సింధు శర్మ

Date:05/12/2020

జగిత్యాల  ముచ్చట్లు:

మహిళా పోలీస్ అధికారులు పోలీస్ శాఖలోని అన్ని అంశాలలో భాగస్వామ్యం అవుతూ తమ వృత్తి ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించాలని జిల్లా ఎస్పీ సింధూ శర్మ  అన్నారు.శనివారం జిల్లా  పోలీసు ప్రధాన కార్యాలయంలో మహిళా పోలీస్ అధికారులతో,సిబ్బంది తో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… ప్రజలలో పోలీసుల పట్ల మరింత నమ్మకం పొందే విధంగా విధి నిర్వహణ చేయడం, మహిళా సమస్యల పట్ల మహిళా పోలీస్ అధికారులు చొరవ చూపించడం ద్వారా పోలీస్ శాఖ గౌరవం పెంపొందించాలని సూచించారు. పోలీస్ ఉద్యోగం ఎంతో ఉన్నతమైనదని, పురుషులతో సమానంగా అన్ని అంశాలలో ప్రావీణ్యం పొందాలని ప్రస్తుత సమాజంలో మహిళా సంబంధిత సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో మహిళా పోలీస్ అధికారుల పాత్ర చాలా కీలకంగా మారిందని గుర్తు చేశారు. పోలీస్ శాఖ గౌరవం, ప్రతిష్ట పెంచే బాధ్యత ప్రతి ఒక్క మహిళా పోలీస్ అధికారి పైన ఉన్నదని చెప్పారు. పోలీస్ శాఖలో అన్ని స్థాయిలలో 33% మహిళా పోలీస్ అధికారులున్నారని ఇది గర్వించదగ్గ విషయమని చెప్పారు.  మహిళా పోలీస్ అధికారులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ వారి గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.పోలీస్ శాఖలో అనేక మార్పులు వచ్చాయని, రాబోయే రోజులలో మరిన్ని మార్పులు వస్తాయని,

 

 

 

అందులో భాగంగా మహిళా అధికారుల సౌకర్యాల కల్పనపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని మహిళా భద్రతకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నామో అదే సమయంలో మహిళా పోలీస్ అధికారుల భద్రతకు అంతే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రతి మహిళా పోలీస్ అధికారులంతా వారి ఉద్యోగాన్ని
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ శాఖలో అనేక మార్పులు వచ్చాయని, ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్న పరిస్థితుల్లో మహిళా అధికారులు ఆ దిశగా ముందడుగు వేయాలని  సూచించారు. ప్రతీ పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీస్ అధికారులకు బ్యారక్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహించే విధులతో పాటు మహిళా అధికారులు నేర విచారణ, కేసుల నమోదు, కంప్యూటర్ నిర్వహణ, రిసెప్షన్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాంటి అన్ని అంశాలలో భాగస్వామ్యం చేసే విధంగా మహిళా సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా పోలీస్ స్టేషన్ల వారీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

 

సమావేశంలో పలువురు మహిళా అధికారులు మాట్లాడుతూ తమను అన్ని విభాగాలు, అన్ని అంశాల్లో భాగస్వామ్యం చేసేలా పై స్థాయి అధికారులు ప్రోత్సహిస్తే తాము వృత్తిలో రాణించగలుగుతామని, వృత్తి రీత్యా అనుభవం పెరుగుతుందని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ  కె. సురేష్ కుమార్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు ,ఎస్.ఐ లు నవత, రాజాప్రమిలా, మహిళ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Women police officers need to develop professionalism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *