మహిళలు ఆరోగ్యంపట్ల జాగ్రత్తలు వహించాలి

Women should be cautious about health

Date:28/05/2019

సదుం ముచ్చట్లు:

మహిళలు ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ రఫి అన్నారు. అంతర్జాతీయ బుతుస్రావ వారోత్సవాలను మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మాట్లాడుతూ కిషోర బాలికలు బుతుస్రావ సమస్యలపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రక్తహీనత, పౌష్ఠికాహరం, వ్యక్తి గత పరిశుభ్రతలపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 50 శాతం మంది బాలికలకు బుతుక్రమం గురించి తెలియదని పేర్కొన్నారు. వీటిపై తల్లిలు బాలికలకు అవగాహన కల్పించాలని , అవసరమైన సమయంలో వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవాలని కోరారు. బాలికలకు మూడనమ్మకాలు కలిగించకుండ సిగ్గు, బిడియం పడకుండ విషయాలు తెలియజేయాలని కోరారు.

మాదవ్‌ , సిద్దారెడ్డిలకు ఘనసత్కారం

Tags: Women should be cautious about health

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *