Natyam ad

పుంగనూరులో మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందాలి – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో సహకారం అందిస్తున్నారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తె లిపారు. గురువారం మండల సమాఖ్య సర్వసభ్య సమావేశాన్ని ఏపిఎం రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని మహిళలను గ్రూపులుగా ఏర్పరచి చింతపండు ప్రొససెంగ్‌కు రూ. 16 లక్షలు రుణం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే పొడి మిషన్లు పెట్టుకునేందుకు రూ.3 లక్షలు, ఫుడ్‌ప్రాససింగ్‌కు రూ.10 లక్షలు ఎలాంటి షూరిటి లేకుండ రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే మండలంలో జగనన్న మార్ట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మహిళలు ఆహార ఉత్పత్తులను నాణ్యంగా ఏర్పాటు చేసి, ఒక బ్రాండ్‌ లేబుల్‌తో మార్కెటింగ్‌ చేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఏపి మహిళలు అన్ని రంగాల్లోను రాణించాలన్నదే ప్రభుత్వ ఆశయమని తెలిపారు. మహిళలు మరింతగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఈశ్వరమ్మ, ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Women should develop economically in Punganur – MPP Akkisani Bhaskar Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.