మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పుంగనూరు ముచ్చట్లు:
మహిళలు అన్నిరంగాల్లోను రాణించాలని , మహిళలతో సమాజాభివృద్ధి సాధ్యమౌతుందని అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి సింధు తెలిపారు. సోమవారం సాయంత్రం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసిడిఎస్ కార్యాలయంలో పీవో రాజేశ్వరి ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. అలాగే పట్టణంలోని కోర్టు ఆవరణంలో సీనియర్ సివిల్‌జడ్జి వాసుదేవరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కార్తీక్ కలసి న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సింధు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుంటు, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం తయారు చేసిన చట్టాలను ఏసమయంలో ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవడం మంచిదన్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు , వాటి నివారణకు ప్రభుత్వం తయారు చేసిన చట్టాలపై అవగాహన కలిగి తమనుతాము రక్షించుకునేలా సిద్దంకావాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ఐయేషా, అంగన్‌వాడీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Women should excel in all fields
