మహిళలు స్వశక్తితో జీవించాలి

Date:23/09/2020

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్

నిరుపేద మహిళకు చేయూతనంధించిన సబ్ రిజిస్ట్రార్

ములుగు ముచ్చట్లు

మహిళలు స్వశక్తితో పని చేసుకుంటూ జీవించాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు,తస్లీమా చిన్న కుమారుడు సుహాన్ పుట్టిన రోజు కానుకగా నిరుపేద మహిళకు కుట్టు మిషన్ అందించి దాతృత్వం చాటుకున్న ములుగు,భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్,సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు తస్లీమా మహమ్మద్,భూపాలపల్లి జిల్లాకు చెందిన సంగి ఉమ అనే నిరుపేద మహిళలకు బుదవారం ములుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తస్లీమా కుట్టు మిషన్ అందించారు, అనంతరం తస్లీమా మాట్లాడుతూ కరోనా సమయంలో ఎదైనా వేడుకలు చేసుకోలేక పోతున్న వారు పేద ప్రజలకు ఎదైనా దానం చేసి దాతృత్వం చాటుకోవాలని కోరారు, తస్లీమా వెంట సత్యనారాయణ, డా;సంతోష్, సర్వర్ ఫౌండేషన్ సభ్యులు మామిడి పెల్లి రమేష్,చంటి సామ్యూల్, అస్మా ,సుజాత, తదితరులు ఉన్నారు.

 

పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కళ్యాణ లక్ష్మీ పథకం

Tags:Women should live on their own

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *