మహిళల భరోసా కోసం ఉమెన్స్ హెల్ప్ డెస్క్-:అడిషనల్ డీసీపీ ఆడ్మీన్
ఖమ్మం ముచ్చట్లు:
మహిళకు భరోసా కల్పించేందుకు ఉమెన్స్ హెల్ప్ డెస్క్ మరింత దోహదపడుతుందని అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ డా. శభరిష్ తెలిపారు. మహిళలు,చిన్నారులు తమ సమస్యలను మరింత స్వేచ్చగా పోలీస్ స్టేషన్లకు చేరుకోగలిగేలా చేయడంపై దృష్టి పెట్టిన పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, రిసెప్షనిస్ట్లులకు ఉమెన్ హెల్ప్ డెస్క్ విధులపై రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ ప్రారంభించారు.
పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ళో జరిగిన ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ మాట్లాడుతూ …బాధిత మహిళలను గౌరవంగా సంబోధించే వాతావరణం కల్పిస్తూ.. తమ సమస్యను ర్భయంగా చెప్పుకునేలా.. న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రతకు తెలంగాణ పోలీస్ శాఖ ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పోలీసులంటే అపోహలు పోగొట్టి ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళ సిబ్బందితో కూడిన మహిళా హెల్ప్ డెస్క్‌ల ద్వారా బాధిత మహిళల పట్ల సున్నితంగా ఉండటానికి, స్నేహపూర్వకంగా ఎలా వ్యవహరించాలో సిబ్బందికి శిక్షణలో నిర్దేశించామని తెలిపారు.శిక్షణ తరగతులను సిరియస్ గా తీసుకొని విజయవంతం చేయాలని సూచించారు.కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ,అడిషనల్ ఎస్పీ ఉమెన్ సేఫ్టీ వింగ్ రామ్ కుమార్ , సీసీఆర్బీ ఏసీపీ వెంకటస్వామి ,సిఐ సాంబరాజు, సిఐ నరేష్ బాబు పాల్గొన్నారు.
Tags: Women’s Help Desk for Women Assurance-:Additional DCP Admin

