Work as planned

ప్రణాళికాబద్ధంగా పని చేయండి

#ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సూచన
#సమస్యల పై అధికారులతో సమీక్ష

Date:08/05/2020

పెద్దతిప్పసముద్రం ముచ్చట్లు:

అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సూచించారు. ఈరోజు పెద్దతిప్పసముద్రం మండల పరిషత్ కార్యాలయంలో కొన్ని శాఖలకు చెందిన అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్య, ఖరీఫ్ ప్రణాళిక, శాంతిభద్రతలు, కరోనా విస్తృతి అరికట్టే చర్యలపై సమీక్షించారు. మండలంలోని అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. కోసం ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. నీటి సమస్య రానివ్వకుండా ప్రజలకు నీటిని అందించాలన్నారు. దీనికోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ లో రైతులకు అందుబాటులో ఉంది చిన్న సమస్య లేకుండా పని చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. హలో అంశాలపై సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ నేత కొండా సిద్ధార్థ, ఎంపీడీవో పద్మా రాణి, ఏవో ప్రమీల, ఎస్సై సుబ్బారెడ్డి, ఏఈ హరి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఉద్యోగిని దూషించిన కేసులో విచారణ

Tags: Work as planned

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *