రైతు సంక్షేమానికి కృషి

Date:28/05/2019

కర్నూలు ముచ్చట్లు:

వ్యవసాయాధికారులు, డీలర్లు సంయుక్తంగా అన్న దాతల సంక్షేమానికి కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో విత్తనాలు, ఎరువులు, పురుగు సమస్యలపై అధికారులు, విక్రయదారులతో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న  కలెక్టరు మాట్లాడుతూ దేశానికి  రైతు వెన్నుముకలాంటివాడు. పది మందికి అన్నం పెటే రైతుకు నాణ్యమైన వాత్తనాలు, ఎరువులు, క్రిమి  సంహారక మందులను, ఎరువులను విక్రయించరాదన్నారు. ఇలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల బలహీనతను సొమ్ము చేసుకోరాదని తెలిపారు. డీలర్లు రైతులకు మాత్రమే ఎరువులను విక్రయించాలని ఇతర వ్యాపార సంస్థలకు గాని వ్యవసాయేతర అవసరాలకు గాని విక్రయించరాదన్నారు. ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలను వ్యవసాయాధికారులు తనిఖి ,చేయాలన్నారు. ధరలను ఎప్పటికప్పడు కంట్రోల్ చేయాలన్నారు. విత్తనాలు, ఎరువులు.క్రిమి సంహారక మందులను నిర్ణీత సమయానికి అందించాలన్నారు. భూసార పరీక్షల కార్డులను రైతులకు ఇచ్చి ఏ విధంగా సాగుచేయాలి. ఎంత మోతాదులో మందెలను వేయాలనే విషయాలపై అవగాహన కల్పించాలన్నారు.

 

 

 

 

 

అలాగే  కౌలు,సన్న,చిన్న,కారు రైతులకు సకాలంలో బ్యాంకుల నుండి రుణాలను ఇప్పించాలన్నారు. రౌతు సంక్షేమమే పరమాధిగా అందరం పనిచేయాలన్నారు. 2017-18 సంవత్సరంలో 4 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగుచేయగా వర్షాభావం, గులభి రంగు పురుగు కారణంగా రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. జిల్లాలో 603 మంది ఎంపిఇఓలు వున్నారని వీరితో పాటు వ్యవసాయాధికారులు నిరంతరం క్షేత్రం స్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు అందిస్తే బంగారు పంటలను పండిస్తారన్నారు. వేరుశెనుగ విత్తనాలను సకాలంలో రైతులకు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖా జేడి ఠాగూర్ నాయక్, ఆత్మ పీడి ఉమామహేశ్వరమ్మ, వ్యవసాయ ఏఓలు, డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

కింగ్ ఫిషర్ కంపెనీ పై ఆలేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

Tags: Work for peasant welfare

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *