Natyam ad

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి -ఎమ్మెల్యే శ్రీధర్ బాబుని మర్యాద పూర్వకంగా కలిసిన ఆర్డిఓ          

మంథని ముచ్చట్లు:


మంథని డివిజన్ లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి మీ వంతు బాధ్యతలను మీరు నిర్వర్తించాలని మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని ఆర్డిఓ వీర బ్రహ్మచారి కి సూచించారు. గురువారం మంథని పట్టణంలోని ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు శ్రీధర్ బాబును మంథని ఆర్డీఓ గా నూతనంగా భాద్యతలు స్వీకరించిన  సందర్భంగా వీరబ్రహ్మచారి     మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు ఆర్డీఓతో మాట్లాడుతూ రచ్చపల్లి,అక్కేపల్లి, లదున పూర్, రాజాపూర్, పెద్దంపేట, సింగిరెడ్డిపల్లి ఆర్అండ్ఆర్ సమస్యలను, భూనిర్వాసితుల అన్ని సమస్యలను తొందరగా పరిష్కరించాలని కోరారు. అర్హులైన వారందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తించేల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మంథని మునిసిపల్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని చాలాసార్లు కలెక్టర్ గారికి కోరడం జరిగిందని, పాత జాబితలో అనర్హుల గుర్తించి ఖచ్చితమైన అర్హులైన నిరుపేదలైన వారికి డబుల్ బెడ్ రూమ్ వెంటనే ఇవ్వాలని కోరారు.ఇంకా పూర్తి కాని డబుల్ బెడ్ రూమ్ ఇల్లులను, ఇప్పటి వరకు కూడా ల్యాండ్ సెలక్షన్ జరిగనీ  వాటిని వెంటనే పూర్తి చేయాలని కోరారు. మంథని, ముత్తారం రామగిరి, కమాన్ పూర్ మండలాల్లోని గ్రామాలలో చాలా మంది ప్రజలకు  భూ సమస్యలు ఉన్నాయని వాటినీ పరిష్కరించాలని, ఇంకా ధరణి పోర్టల్  నమోదు కాని వారికి అవకాశం ఇవ్వాలన్నారు. మంథని మున్సిపల్ ప్రాంతంలో బీసీ కమ్యూనిటీ హాల్  నిర్మించడానికి చాలాసార్లు స్థలం కావాలని కోరడం జరిగిందని, ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి కూడా నిధులు ఇవ్వడం జరిగిందని  బీసీ కమ్యూనిటీ హాల్ కు వెంటనే భూమి కేటాయించాలని కోరారు. ఆర్డీఓ వెంట ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారి రవీందర్ ఉన్నారు.

 

Tags: Work hard to solve public problems – RDO met MLA Sridhar Babu as a matter of courtesy

Post Midle
Post Midle