ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా

Work on the development of temples

Work on the development of temples

– మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా

Date:20/10/2019

రామసముద్రం, ముచ్చట్లు:

 

ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా అన్నారు. ఆదివారం మండలంలోని మాలేనత్తం పంచాయతీ చింపరపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థప్రసాదాలు, స్వామివారి శేష వస్త్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సి. జయరామిరెడ్డి, కొండూరు కృష్ణారెడ్డి, భాస్కర్ గౌడ్, దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి, కొత్తూరు ఆంజిరెడ్డి, శ్రీనివాసులు, రమణారెడ్డి, రఘునాథరెడ్డి, వి. మునిరెడ్డి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Work on the development of temples
Work on the development of temples

చట్టాలను అవగాహన చేసుకోవాలి

Tags: Work on the development of temples

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *