Natyam ad

అత్యధిక మెజార్టీ సాధించేలా పని చేయాలి- మంత్రి పెద్దిరెడ్డి పిలుపు

– రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయాలి

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ప్రతి ఒక్కరు ఐకమత్యంతో కలసి పనిచేస్తే అత్యధిక మెజార్టీ ఓట్లు సాధించగలమని , రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకే వేసేలా ఓటర్లను చైతన్యపరచాలని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నియోజకవర్గంలోని సోమల మండలం కందూరులో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే నెల్లిమంద, తెట్టుపల్లి, కమ్మపల్లె, నవాబ్‌పేట ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్యవైశ్యలకు అన్ని విధాలుగా చేదోడుగా ఉంటు వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన 4 శాతం మైనార్టీల రిజర్వేషన్లను ఉమ్మడి పార్టీలు ఎత్తి వేస్తుందన్నారు. బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని తనే చెప్పుకుంటు రాష్ట్ర విభజనలో మనకు తీవ్ర ద్రోహం చేశాడని ఆరోపించారు. కేంద్రంలో మోదీని చూసి ఇక్కడ ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. కిరణ్‌కు వేసే ప్రతి ఓటు వృదానేనని , అతనికి డిపాజిట్లు కూడ రావని తెలిపారు. చిదంబరం కాళ్లు పట్టుకుని సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌ వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌ పార్టీని నామరూపాలు లేకుండ చేశాడని ఆరోపించారు.

 

 

 

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించిన కిరణ్‌ను ప్రజలు క్షమించరాదన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలనను కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి , ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా మిధున్‌రెడ్డి లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రెండవ సారి సీఎంగా ఎన్నికైయ్యేలా ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఈశ్వరయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్లు నాగేశ్వరరావు, మోహన్‌, సర్పంచ్‌లు మసూద్‌బాషా, చంద్రకళ, నాయకులు సురేష్‌కుమార్‌, బాషా, గాలిసురేష్‌, చంద్రశేఖర్‌, వెంకటేష్‌, భాస్కర్‌నాయడు, సౌజన్య, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Work should be done to achieve the highest majority – Minister Peddireddy’s call

Post Midle