Work to ensure welfare schemes for all eligible

అర్హులందరికీ సంక్షేమపథకాలు అందేలా పనిచేయండి

– ప్రజలతో క్రమశిక్షణగా ప్రవర్తించాలి
– గ్రామ సచివాలయ సిబ్బంది కి అవగాహన సదస్సు
– అభివృధ్దిపనులు వేగవంతం చేయాలి

Date:22/10/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరికీ అందేలా గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పనిచేయాలని ఎంపీడీఓ వెంకటరత్నం సూచించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కార్యాలయ నడవడిక,మరియు సమాచార ప్రసార నడవడికపై సచివాలయ సిబ్బందికి అవగాహన సదస్సు జరిగింది. ఈ సధర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ కార్యాలయాల్లో ఉద్యోగులు ఐకమత్యంతో సమయపాలన పాటించాలి. కార్యాలయంలో ప్రభుత్వ సేవలకొసం వచ్చేప్రజల పట్ల సేవాభావంతో సమస్యలను తెలుసుకొని సేవలందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అర్హులందరికీ సకాలంలో తెలియజేసి లబ్దిచేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నతాధికారుల సూచనలమేరకు వివిధ రకాల ప్రగతి నివేదికలను అడిగిన వెంటనే సకాలంలో తెలియజేసి గ్రామాల అభివృద్దికి కృషిచేయాలన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో మండలానికి మంజూరుచేసిన వివిధ అభివృద్దిపనులను త్వరగత గతిన పూర్తిచేసేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఈఓపిఆర్డీ మహమ్మద్‌ ఆజాద్‌ తదితరులున్నారు.

వలంటీర్ల పోస్టులకు ధరఖాస్తులు స్వీకరణ

Tags: Work to ensure welfare schemes for all eligible

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *