పుంగనూరులో ఎయిడ్స్ వ్యాది నివారణకు కృషి చేయండి – న్యాయమూర్తి కార్తీక్
పుంగనూరు ముచ్చట్లు:
ప్రతి ఒక్కరు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకుని, నివారణ చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కార్తీక్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని తాటిమాకులపాళ్యెం రోడ్డులో గల పిహెచ్సీలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జిల్లా అంధత్వనివారణ అధికారి డాక్టర్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్వ్యాధిని నివారించాలంటు కరపత్రాలను న్యాయమూర్తి విడుదల చేసి, ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. లైంగిక వ్యాధులను నివారించేందుకు డాక్టర్ల సూచనలు, సలహాలు తప్పక పాటించాలన్నారు. వ్యాదులు రాకుండ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ప్రతి ఒక్కరు మంచి అలవాట్లు, నాణ్యమైన ఆహారం తీసుకోవాలన్నారు. అలాగే పిహెచ్సీ డాక్టర్లు సల్మాబేగం, సృజన ఆధ్వర్యంలో రాంపల్లెలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్ , డాక్టర్లు రెడ్డికార్తీక్,బాలసాయిరెడ్డి, సూపర్వైజర్లు మురళి, హరిప్రసాద్, దనలక్ష్మీ, సోమశేఖర్, గజరాజు, భారతి, నాగవేణి, శశికళ ల్గొన్నారు.

Tags: Work to prevent AIDS in Punganur – Justice Karthik
