Natyam ad

ప్రజాహితం కోసం కలిసి పనిచేయాలి

కడప ముచ్చట్లు:

 

ప్రజాహితం కోసం పనిచేస్తున్న సంస్థలన్నీ ఐక్యంగా  కలిసిరావాలని పర్యాటక పితామహులు సిద్దవటం సీతారామయ్య అన్నారు.  మంగళవారం స్థానిక పటేల్‌ రోడ్డులోని శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్యాలయంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కడప అన్నమయ్య అధ్యక్షులు డా. ఆర్‌. రంగనాథ రెడ్డి ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.  ప్రస్తుతం ప్రజాహితం కోసం పనిచేస్తున్న సంస్థలన్నీ సేవలందించడం సంతోషదాయకమని, జిల్లా ఖ్యాతిని పెంచేలా కార్యక్రమాలను రూపొందించి కార్యాచరణకు దిగాలని ఆయన సూచించారు.  మనిషి ఆనందంగా జీవించేందుకు ఆరోగ్యం చాలా ముఖ్యమని దానిద్వారా ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయని తెలిపారు.  శారీరక ఆరోగ్యంతో మానసిక ఆనందం కలుగుతుందని కష్టమైన పనులుకూడా చేసే స్థాయి ఆత్మస్థైర్యం లభించగలదని తెలిపారు.  ప్రముఖ ఆర్థోవైద్యులు డా. సి. విద్యాసాగర్‌ రెడ్డి మాట్లాడుతూ సంపాదనకోసం తపిస్తూ నేటి మానవుడు ఆనందమయ జీవితానికి కారణమయ్యే ఆరోగ్యాన్ని దూరం చేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.  లయన్స్‌ అధ్యక్షులు

 

 

 

డా. ఆర్‌. రంగనాథ రెడ్డి మాట్లాడుతూ నగర వైద్యుల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.  ప్రముఖ దంతవైద్యులు డా. కమలాకర్‌, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ డివిజనల్‌ మేనేజర్‌ రాజశేఖర్‌ రెడ్డి, బ్రాంచి మేనేజర్లు శివశంకర రెడ్డి, మల్లికార్జున రెడ్డిలు మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ లాంటి గొప్ప సంస్థల ఆధ్వర్యంలో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తే సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  లయన్స్‌ క్లబ్‌ కోశాధికారి సుశీల్‌, సభ్యులు బి. కొండా రెడ్డి, పవర్‌ గ్రిడ్‌ సౌత్‌ ఇండియా డిప్యూటి డైరెక్టర్‌ రాజశేఖర్‌, రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటి ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన రాజు పాల్గొన్నారు.  అనంతరం శిబిరంలో పాల్గొన్న వైద్యులు పలువురు పేషంట్లకు షుగర్‌, ఎముకల, దంత పరీక్షలు నిర్వహించి చికిత్స చేశారు.

 

Post Midle

Tags: Work together for common good

Post Midle

Leave A Reply

Your email address will not be published.