వర్షంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్న కార్మికులు

Workers doing sanitation programs in the rain

Workers doing sanitation programs in the rain

Date:22/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

ఉదయం నుంచి వర్షపుజల్లులు , ఈదురగాలులు వీస్తున్నా మున్సిపల్‌ కార్మికులు వీటిని లెక్కచేయక స్వచ్చ సర్వేక్షణ్‌లో భాగంగా పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు గురువారం చేపట్టారు. ఎంబిటి రోడ్డు, గాంధినగర్‌, బెస్తవీధి, ప్రాంతాలలో మురుగునీటి కాలువల్లో పూడికతీసే పనులు చేపట్టారు. స్వచ్చసర్వేక్షణ్‌ కార్యక్రమంలో బాగంగా కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో కార్మికులు పట్టణంలోని మురుగునీటి కాలువల్లో పూడికతీసే పనులను నిర్వహించారు. మట్టిని తీసి మురుగునీటిని తొలగించారు. పూడికమట్టిని ట్రాక్టర్ల ద్వారా కంపోస్ట్యార్డులకు తరలించారు. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులను కమిషనర్‌ వర్మ, పట్టణ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ శానిటటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌,కార్మికులు శ్రీరాములు, నాగయ్య, నాగమల్లు, మధు, రాజరత్నం తదితరులు పాల్గొన్నారు.

 

జనగణమనకు ’’శత’’వందనం

Tags; Workers doing sanitation programs in the rain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *