Date:03/12/2019
నర్సంపేట ముచ్చట్లు:
అసంఘటిత కార్మికులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని లేబర్ శాఖ ద్వారా విరివిగా పథకాల ద్వారా లబ్ది పొందాలని టిఆర్ఎస్కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఇంచార్జ్ పాలడుగుల రమేష్ లు తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో మోటార్ మెకానిక్ షాపుల్లో పనిచేస్తున్న కార్మికులకు లేబర్ కార్డులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రోజువారీగా కూలి చేసుకునే కార్మికులందరికీ లేబర్ శాఖ ద్వారా కార్డులు జారీ చేసి తద్వారా వచ్చే సంక్షేమ పథకాలను కార్మిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందజేస్తుందని పేర్కొన్నారు. అసంఘటిత కార్మికులు అందరూ తప్పనిసరిగా తమ పేర్లను లేబర్ శాఖలో నమోదు చేసుకొని లేబర్ కార్డు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హమాలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి లక్ష్మి నారాయణ, యూనియన్ అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శి మధు, కోశాధికారి రవీందర్, నాయకులు సర్దార్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.
విట్టల్ వాడి మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసిన డాషింగ్ డైరెక్టర్ వి.వి.వినాయక్
Tags:Workers should adopt welfare schemes