కార్మికులకు  గ్రాట్యుటీ ఇవ్వాలి-ఏఐటియుసి

కడప ముచ్చట్లు:

అంగన్వాడీలు ఉద్యోగ  విరమణ సదుపాయం అయినా గ్రాట్యుటీకి వడ్డీతో సహా చెల్లించాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించడం స్కీం వర్కర్స్ కు తీపికబురని మోడీ ప్రభుత్వానికి చెంపదెబ్బని దీనిని అమలు పరచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి  డిమాండ్ చేశారు బుధవారం స్థానిక హోచిమిన్ భవన్ యందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నాగ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించిన సుప్రీంకోర్టు తీర్పు దేశంలోని అన్ని ప్రాంతాల్లో వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.గౌరవ వేతనం పేరుతో స్కీమ్ వర్కర్ల అందర్నీ దోపిడీ చేయడాన్ని కోర్టులో,బయట ఐకమత్యంగా ఏర్పడి ఉద్యమించేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.స్కీం కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని పీఎఫ్ ,ఈఎస్ఐ, గ్రాట్యుటీ సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె సి బాదుల్లా, జిల్లా కార్యదర్శిలు ఉద్దే. మద్దిలేటి, కే.లింగన్న లు పాల్గొన్నారు.

 

Tags: Workers should be given gratuity-AITUC

Post Midle
Post Midle
Natyam ad