కార్మికులు సమ్మెలతో నష్టపోరాదు

Workers should not be injured by strikes

Workers should not be injured by strikes

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:08/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపల్‌ కార్మికులు సమ్మెలు చేసి నష్టపోరాదని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ కోరారు. సోమవారం ఆయన గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులతో చర్చలు జరిపారు. మున్సిపల్‌ కార్మికులు పనులు బహిష్కరించి, సమ్మె చేస్తే జీతం నిలిపివేయాల్సి వస్తుందన్నారు. అలాగే పట్టణంలో ఏళ్ల తరబడి చేస్తున్న శ్రమకు ఫలితం లేక పట్టణం అపరిశుభ్రంగా మారిపోతుందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కొంత మంది మాత్రమే ఆందోళనలు కొద్ది సమయం చేసి, మిగిలిన సమయంలో పనులకు సహకరించాలని కోరారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు పూర్తి నివేదికలను ప్రభుత్వానికి పంపి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై కార్మికులు సుముఖత వ్యక్తం చేశారు. కాగా మంగళవారం నుంచి కార్మికులు పనులకు రానున్నారు. ఈ కార్యక్రమంలో అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, టౌన్‌మిషన్‌ కో-ఆర్డినేటర్‌ మధుసూదన్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌ తో పాటు కార్మిక సంఘ నాయకులు శ్రీరాములు, నాగయ్య, రెడ్డెప్ప, రెడ్డెమ్మ తదితరులు పాల్గొన్నారు.

కరాటే పోటీల్లో పుంగనూరు విద్యార్థుల ప్రతిభ

Tags: Workers should not be injured by strikes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *