కార్మికులు ఇశ్రామ్ కార్డులు తీసుకోవాలి-అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అనిల్.

మెట్ పల్లి ముచ్చట్లు:
 
అన్ని రంగాల కార్మికులు ఇశ్రామ్ కార్డులు తీసుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్  అనిల్ కదం అన్నారు. మంగళవారం మెట్పల్లి టూవీలర్ మెకానిక్ వర్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు ఆయన   అసోసియేషన్ లీగల్ అడ్వకెట్ కొమిరెడ్డి లింగా రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం లేబర్ ఆఫీసర్ అనిల్ కదం మాట్లాడుతూ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇశ్రమ్ లేబర్ కార్డులతో పాటు ఇన్సూరెన్స్ ఐడి కార్డులు రూపొందించుకోవడం చాలా మంచి కార్యక్రమం అని తెలిపారు. దీని ద్వారా వారి గుర్తింపు కార్డు ఎక్కడికిపోయినా చూపించుకొని మెకానిక్ కార్మికులమని బయట మెకానిక్ పనుల చేసుకోవచ్చని అలాగే ఏ రాష్ట్రం పోయిన తిరగడానికి ఎవరైనా అధికారులు ఆపిన
ఐడీ కార్డు చూపేందుకు దోహదపడుతుందని అన్నారు. ముఖ్యంగా ఈ కార్డు అన్ని రంగాల్లో పని చేసే కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని, ఇది ఉచితంగా మీ సేవలో సెంటర్ లో ఆధార్ కార్డు ద్వారా కార్డ తీసుకోవచ్చనని అన్నారు. ఈ కార్డు ద్వారా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ లో కాళ్లు చేతులు నష్టం జరిగిన అలాగే రెండు లక్షల ఉచిత కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతారని దీనిని అధిక సంఖ్యలో కార్మికులు కార్మిక సంఘ యూనియన్లు కలిసి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ మెటపల్లి కన్వీనర్ కంఠం రాజ్ కుమార్, సంఘం అధ్యక్షులు బూస శంకర్, జోగ జలంధర్, ఉపాధ్యక్షులు రాజేందర్, రాజేష్ ,నరసయ్య,రహీం భాయ్, రాజేశ్వర్,బూస శ్రీనివాస్, సమ్మయ్య సంఘ సభ్యులు ఉన్నారు.
 
Tags:Workers should take Ishram cards-Assistant Labor Officer Anil

Leave A Reply

Your email address will not be published.