Natyam ad

కార్మికులు భద్రత గా పని చేయాలి -దాల్మియా సిమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేశ్ సిన్హా…

కడప ముచ్చట్లు:

గనులలో కార్మికులు భద్రతతో పనిచేయాలని 37వ గనుల భద్రత వారోత్సవాల లో దాల్మియా సిమెంట్ ముఖేష్ సిన్హా పేర్కొన్నారు  కడప నగర శివారులో మేడా కన్వెన్షన్ హాల్లో 37వ గనుల భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సమావేశం సమావేశం దాల్మియా సిమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ప్రభాత్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మలైతీ ఖదార్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ (తెలంగాణ) సుప్రియో చక్రబూర్థి హాజరై మాట్లాడుతూ
గనులలో ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు జాగ్రత్తతో పనిచేయాలని తెలిపారు కార్మికులు హెల్మెట్లు బూట్లు దుస్తులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు అన్ని సిమెంట్ రంగాలలో పనిచేసే కార్మికులకు భద్రత కల్పించడానికి అవగాహన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు .

 

 

Post Midle

44 మైన్స్ కంపెనీల కలసి దాల్మియా సిమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకర మైందన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్మించడానికి సహాయ సహకారాలు అందించిన కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు, గవర్నర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం దాల్మియా సిమెంట్ మేనేజింగ్ హెడ్ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులు భద్రతతో పని చేస్తూ తగిన జాగ్రత్తలు మెలకువలు పాటించాలని కోరారు ఈ వారోత్సవాలు ఎంతో ఘనంగా జరిపేందుకు దాల్మియా సిమెంట్ ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ ముగింపు కార్యక్రమంలో సాంస్కృతి కార్యక్రమాల సభ సభ్యులను ఎంతో ఆగట్టుకుని అల్లరింప చేశాయి అలాగే దాల్మియా ఫ్యాక్టరీలో పని చేసిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది అని తెలిపారు.

 

Tags; Workers should work safely – Dalmia Cement Executive Director Mukesh Sinha…

Post Midle