ఎన్నికల కోసం కసరత్తు షురూ

Date:10/10/2018
కరీంనగర్  ముచ్చట్లు:
కరీంనగర్ ల్లాలో మూడు నియోజకవర్గాల్లో 803 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో పెద్దపల్లిలో 266, రామగుండంలో 262, మంథనిలో 275 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం జాబితా సిద్దం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న శాశ్వత, టెంపరరీ ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఎప్పుడు విధుల్లోకి చేరారు…? పొందుతున్న వేతనం, ఓటరు, ఆధార్‌ సంఖ్య, జన్మస్థలం తదితర అంశాలను నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గెజిటెడ్‌ 318 నాన్‌గెజిటెడ్‌ 3851, ఒప్పంద, పొరుగు సేవలు 76 చోప్పున 4245 మంది ఉద్యోగులు ఉన్నట్లు తేలింది. అత్యధికంగా విద్యాశాఖలో సిబ్బంది ఉన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాస్థాయిలో 15 కమిటీల్లో నోడల్‌ అధికారులను నియమించారు. ఇప్పటికే ఆయా కమిటీలకు ఎన్నికల నిర్వహణ, ప్రవర్తన నియమావళి, ఇతర ఆంశాలపై కులంకషంగా అవగాహన కల్పించారు. దిశ నిర్దేశం చేయడంతో నోడల్‌ అధికారులు కార్యక్షేత్రంలోకి దిగారు. రెండు రోజులుగా రాజకీయ పార్టీల ప్రచారంపై వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా ప్రకటనలు చేస్తున్నారనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
ఎప్పటికప్పుడు సమాచార సేకరణ చేస్తున్నారు. కొత్తగా అంతర్జాలంలోనే ఫిర్యాదులు స్వీకరించే వెసులుబాటు కల్పించడంతో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేసేందుకు పాలనాధికారిణి శ్రీదేవసేన జిల్లాలో మూడు ప్రత్యేక బృందాలను నియమించారు. ఎన్నికల కోడ్‌ అమలులో వీరు కీలకంగా వ్యవహరించనున్నారు. జిల్లాలో స్టాటిక్‌ సర్వలెస్‌ టీం, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం, వీడియో వీవింగ్‌ టీం పర్యవేక్షణలో కొనసాగనుంది. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వీడియోగ్రాఫర్‌ ఆయా బృందాల్లో సభ్యులుగా ఉన్నారు.
Tags:Workforce Shura for Election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *