గ్రామీణ శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి-వైకాపా నేత కోటంరెడ్డి
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు నియోజకవర్గంలో శివారు ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డ్ లో 20 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మేయర్ పొట్లూరు స్రవంతి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే కోటంరెడ్డికి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని ప్రాంతాలలో కూడా నేడు సిమెంట్ రోడ్లు,డ్రైనేజీ కాలువలు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగర మేయర్ స్రవంతి మాట్లాడుతూ రూరల్ కు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆరవ శాంతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అరవ శ్రీనివాసులు, అజయ్, భారతమ్మ,, హృదయ్ కుమార్, మస్తానయ్య మల్లికార్జున్, శశిధర్ రెడ్డి, రాఘవేంద్ర, ఖాదర్ బాష తదితరులు పాల్గొన్నారు.

Tags:Working for the development of rural suburbs- Vaikapa leader Kotam Reddy
