Working for the party is a matter of identity.

పార్టీ కోసం పని చేస్తే గుర్తింపు తథ్యం.

-మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆదిమూలం.

Date:25/05/2020

సత్యవేడు ముచ్చట్లు:

ఎవరు కూడా పార్టీని బలహీన పరిచే చర్యలకు వెళ్లొద్దు. పార్టీ కోసం పనిచేసే నేతలు, కార్యకర్తలకు గుర్తింపు తథ్యమని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగిన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ స్వలాభం పక్కనపెట్టి అభివృద్ధికి దోహదపడాలి అన్నారు. అయితే గ్రూపులతో పార్టీని బలహీనం చేయడం తగదన్నారు. తాను పార్టీ శ్రేణుల నుంచి, అధికారుల నుంచి సింగిల్ పైసా కూడా ఆశించననీ కుండ బద్దలు కొట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి లబ్ది పొందడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులు పై ఉందని ఆయన గుర్తు చేశారు. వీటిని సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తులో పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో పాలనాపరంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయం ఏర్పాటు, అమ్మ ఒడి పథకం, వైయస్సార్ ప్రమాద బీమా వైయస్సార్ ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలను బలోపేతం చేయడం వంటి ఎన్నో పథకాలు అమలు అవుతున్నట్టు ఆయన చెప్పారు.

 

 

 

 

అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గం రైతులకు మేలు చేకూరే విధానాలు చేపట్టాలని ఆయన కోరారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ రీజినల్ డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో రైతులు పండించిన పంటలకు సంబంధించి గిట్టుబాటు ధరలు కల్పించడం వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఇంకా అధునాతన వసతులను కల్పించడానికి తగు చర్యలు చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. కాగా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకారంలో ముఖ్యంగా 20 మంది సభ్యులలో ముగ్గురు గైర్హాజరు అయ్యారు. ఇందులో అధికారులే ఉండడం గమనార్హం. మార్కెట్ కమిటీ జాయింట్ డైరెక్టర్, సత్యవేడు వ్యవసాయ ఏడి, నాగలాపురం ప్రత్యేక అధికారి ప్రమాణ స్వీకారోత్సవానికి డుమ్మా కొట్టడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రెటరీ గంగయ్య, వివిధ మండలాల వైకాపా నేతలు బాలాజీ రెడ్డి, సుశీల్ కుమార్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ రెడ్డి, మస్తానమ్మ, రమేష్, గురు ప్రసాద్, అపరంజి రాజు, చిన్న దొర, భాస్కర్ నాయుడు, మురళి, ఉదయ్ కుమార్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రెండవ పెళ్ళి మోజుతో.. పాముతో కాటెయించి భార్య హత్య

Tags: Working for the party is a matter of identity.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *