అమరావతి ముచ్చట్లు:
జగన్ సెక్యూరిటీ నెల ఖర్చు లెక్క చెప్పిన హోంమంత్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం చేపట్టిన పనులు.. చేసిన ఖర్చుల గురించి విడతల వారీగా లెక్కలు చెప్పటం.. వాటికి సంబంధించిన వివరాల్ని విలేకరులకు సమావేశాలు పెట్టి మరీ వెల్లడించే పని చేపట్టింది చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న వేళలో.. ఆయనకు సెక్యూరిటీగా 980 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. దీని కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్పారు.
Tags: Works undertaken by Jagan Govt.