ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే

Date:29/10/2020

జగిత్యాల  ముచ్చట్లు:

అక్టోబర్ 29 ను ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే ను పురస్కరించుకుని న్యూరో సంబంధిత వ్యాధులకు జగిత్యాల ప్రాంతంలో మెరుగైన వైద్యం అందిస్తున్న జగిత్యాల సాయిరాం న్యూరో హాస్పిటల్… న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎన్నాకుల రాము ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు…  రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ సీనియర్ జర్నలిస్ట్సిరిసిల్ల శ్రీనివాస్, కళాశ్రీ గుండేటి రాజు, రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు పల్లెర్ల రాజు, కళాకారులు కొమురవెల్లి లక్ష్మినారాయణ, పాత్రికేయులు సిరిసిల్ల వేణుగోపాల్ తదితరులు సాయిరాం న్యూరో హాస్పిటల్ లో కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువాతో డా.ఎన్నాకుల రామును సత్కరించారు.ఈ సందర్భంగా డా.రాము కృతజ్ఞతలు తెలుపుతూ,  మాట్లాడుతూ…ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే గురించి,   బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే అవసరమైన చికిత్స గురించి వివరించారు.

 

 

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి మరియు స్ట్రోక్ సంభవం తగ్గించడానికి ప్రతి సంవత్సరం, అక్టోబర్ 29 ను ప్రపంచ స్ట్రోక్ డేగా జరుపుకుంటారన్నారు.
ఒక స్ట్రోక్ ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సంభవించవచ్చుననీ..  1:4 వంతున పెద్దలకు వారి జీవితకాలంలో స్ట్రోక్ ఉంటుందన్నారు.  ప్రపంచవ్యాప్తంగా మరణం మరియు వైకల్యానికి స్ట్రోక్ ఒక ప్రధాన కారణం అనీ, కానీ దాదాపు అన్ని స్ట్రోక్‌లను నివారించవచ్చుననీ…స్ట్రోక్ వచ్చినప్పటినుంచి మూడు గంటలలోపు సంబంధిత చికిత్స అందినట్లైతే …స్ట్రోక్ వచ్చిన వ్యక్తి బతికే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.

జగిత్యాల సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కు  కరోనా వారియర్స్ అవార్డ్

Tags: World Brain Stroke Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *