World Cancer Awareness

ప్రపంచ క్యాన్సర్ అవగాహన

Date:12/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

మంచి జీవనశైలి తో మనమంతా ఆరోగ్యముగా జీవించడం సాధ్యమేనని ఆరోగ్య విద్యాధికారి కొండయ్య అన్నారు.బుధవారం ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినం కార్యక్రమంలో భాగంగా చంద్రమాకుల పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి మంచి జీవన నైపుణ్యాల తో అడ్డుకట్టు , అంశముపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కొండయ్య వివరిస్తూ ప్రాణాంతకమైన క్యాన్సర్ ప్రతి ఒక్కరి జీవితములోకి తొంగి చూడకుండా ఉండాలంటే వ్యక్తి నిర్వహించే మంచి జీవనశైలి తో క్యాన్సర్ నియంత్రణ సాధ్యమని , ప్రధానంగా,ప్రతి ఒక్కరు బరువు పెరగకుండా చూసుకోవడం, రోజుకో గంట నడక లేదా వ్యాయామమం చేయడం, తియ్యటి,చల్లటి పానీయాలు తీసుకోకపోవడం, పీచు ఎక్కువగా వుండే పదార్థాలు తీసుకోవడం, కొవ్వు తక్కువా ఉండే పదార్థాలు తినడం, ఒకసారి వాడిన నూనెను మళ్లీమళ్లీ వాడకపోవడం, తాజా పండ్లూ కూరగాయలూ, పొట్టుతీయని ధాన్యాలూ పప్పుధాన్యాలూ ఎక్కువగా తినడం, మంచి పౌష్టికాహారము తీసుకోవడం,మరియు అతిగా మాంసాహారం, మద్యానికీ పొగాకుకీ మరియు పొగాకు ఉత్పత్తుల దూరంగా ఉండటం, ప్లాస్టిక్‌ని బహిష్కరించడం, నీళ్లు ఎక్కువగా తాగడం,8 గంటల నిద్ర,

 

 

 

 

ఒంటినీ ఇంటినీ శుభ్రంగా ఉంచుకోవడం, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచే ప్రాణాయామం చేయడం, రక్షిత శృంగారం, ఒత్తిడి లేని వృత్తి జీవితం, ఉల్లాసంగా ఉండటం, మనసుకు హాయినిచ్చే అభిరుచుల్ని పెంచుకోవడం… మొదలగు మంచి జీవనశైలి పాటించే వాళ్లకి క్యాన్సర్‌ అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం,పక్షవాతం,మొదలగు వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువని కొండయ్య తెలిపారు .పర్యవేక్షకులు హరిప్రసాద్ రెడ్డి విద్యార్థులకు దోమలు వాటివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు నివారణ చర్యలు గూర్చి వివరించారు.కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు హరిప్రసాద్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి,గ్రామ వాలంటిరీలు, ఏ.యన్.యం.లు, ఆశా కార్యకర్తలు విద్యార్థులు,పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ చే వైద్యశిబిరం

 

Tags: World Cancer Awareness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *