ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
నంద్యాల ముచ్చట్లు:
ఏప్రిల్ ఏడవ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా నంద్యాల ఐఎంఏ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశయమైన “అందరికీ ఆరోగ్యం”, ఐఎంఏ ఈ సంవత్సరం నినాదం ప్రజారోగ్యం కోసం అంకితం కార్యక్రమంలో భాగంగా ప్రజా అవగాహన నడక ర్యాలీ నిర్వహించారు. స్థానిక మధుమణి నర్సింగ్ హోమ్ నుండి ప్రారంభమైన ఈ వైద్యుల నడక ర్యాలీని రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ప్రారంభించారు.
నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జఫరుల్లా డాక్టర్ చంద్రశేఖర్ కోశాధికారి పనిల్ నిర్వహణలో జరిగిన ఈ ర్యాలీలో దాదాపు 100 మంది నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఐఎంఏ దేశవ్యాప్తంగా సమర్పన్ దినోత్సవం గా నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా నడక ర్యాలీ ఉచిత వైద్య శిబిరాలు రాష్ట్రంలోని అన్ని ఐఎంఏ శాఖలలో ఈరోజు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రజారోగ్యం కోసం ఐఎంఏ పునరంకితమవుతుందని ప్రకటించారు.
ఈ ర్యాలీలో రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ,ప్రముఖ వైద్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదనరావు, నంద్యాల మహిళా విభాగం నాయకులు డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మదా, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ మాధవి, రాష్ట్ర ఐఎంఏ మహిళా విభాగం నాయకులు డాక్టర్ వసుధ, డాక్టర్ లక్ష్మీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Tags; World Health Day under the auspices of IMA
