ప్రపంచ వారసత్వ వారోత్సవాలు

అనంతపురం  ముచ్చట్లు:

ప్రపంచ వారసత్వ వారోత్సవాలు2023 సందర్భంగా 3వ ,   22 న రోటరీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల వేదికగా పాఠశాలల విద్యార్థులకు పద్య పఠన పోటీలు రెండు విభాగాలలో నిర్వహించడం జరిగింది. ఈ పోటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ పి. శేషాంజనేయులు హాజరై పిల్లలకు సందేశం ఇచ్చారు .ఈ పోటీలకు న్యాయనిర్ణతలుగా ప్రముఖ క వి  ఒంటెద్దు రామలింగారెడ్డి  ,ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల ఆంధ్రభారతి ఉపన్యాసకులు డాక్టర్ నగరూరు రసూల్  కవి గాయకుడు డాక్టర్ సి. రామాంజనేయులు  తెలుగు పరిశోధక విద్యార్థి పూజారి ఈరన్న  వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ సినర్జీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ , రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ , ఎస్ఎస్ బిఎన్ పాఠశాల , నెహ్రూ నగరపాలక ‌ఉన్నత పాఠశాల  శారద నగరపాలక పాఠశాల, విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ , శ్రీ పొట్టి శ్రీరాములు నగరపాలక పాఠశాల,  వికాస్ మోడల్ స్కూల్ రామన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్,లిటిల్ ఫ్లవర్ స్కూల్, కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటాక్ అనంతపురము జిల్లా చాప్టర్ కన్వీనర్ రామ కుమార్ అధ్యక్షులు గా కార్యక్రమం నిర్వహించారు. ఇంటాక్ సభ్యుడు రియాజుద్దీన్   ఆహ్వాన స్వాగత వచనం పలికారు . కృష్ణ మూర్తి  విద్యార్థులను వేదిక మీదికి తీసుకొని వచ్చి పద్యాలు పఠింప జేశారు. జూటూరు షరీఫ్  వందన సమర్పణ చేశారు. జాతీయ గీతాలాపన తో కార్యక్రమం ముగిసింది.

Post Midle

Tags: World Heritage Week

 

 

Post Midle