ప్రపంచ పరిశుభ్రత దినోత్సవ ర్యాలీ

World Hygiene Day Rally

World Hygiene Day Rally

Date:15/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవ ర్యాలీని మున్సిపాలిటిలో మహిళలు మంగళవారం నిర్వహించారు. కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో టౌన్‌మిషన్‌ కోఆర్డినేటర్‌ రవి కలసి మహిళలచే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేతులు శుభ్రం చేసుకోవాలని , పరిశుభ్రమైన తాగునీటితో వ్యాదులు నివారించాలని , పరిశుభ్రతకు అగ్రస్థానం కల్పించాలని మహిళలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటి పరిధిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అగ్రస్థానం కల్పించామన్నారు. పట్టణంలో ప్లాస్టిక్‌ను , బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించేమన్నారు. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు , ప్రజలకు స్వచ్చమైన గాలిని అందించేందుకు పట్టణాన్ని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు హరిత పట్టణంగా చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా పట్టణంలో లక్షవెహోక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. వెహోక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేసి, మున్సిపాల్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆదర్శంగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమాలలో ప్రజలు, ప్రజాప్రతినిధులు , ప్రభుత్వ ఉద్యోగుల సాకారం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీవో అనిత , మహిళలు పాల్గొన్నారు.

ప్రభుత్వవారధులుగా సచివాలయ ఉద్యోగులు

Tags: World Hygiene Day Rally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *