మంథనిలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం  

మంథని ముచ్చట్లు:


మంథని మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 183వ  ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మంథని అంబేద్కర్ చౌక్ లో కెమెరా సృష్టకర్త లూయిస్ జే.ఎం.డాగ్యూరే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్  చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దండు రమేష్, ప్రధాన కార్యదర్శి జెట్టి శంకర్, కోశాధికారి నాగేల్లి మహేష్, ఉపాధ్యక్షులు అంబటి నర్శింగ్, సీనియర్ ఫోటో గ్రాఫర్స్ జిల్లా ఉపాధ్యక్షులు తూర్పాటి సత్యనారాయణ, నాయకులు గంధం ఆంజనేయులు,  పిఆర్ఓ గంట ప్రశాంత్, ఎన్నాం దేవేందర్, తోగారి కిరణ్, సహాయక కార్యదర్శి జంజర్ల సాయికిరణ్, మిట్టపల్లి కిషోర్, రాపర్తి అఖిల్, డైరెక్టర్లు వెంకటేష్, రమేష్ , సంతోష్, నరేష్, రాకేష్, సాగర్ కిరణ్, అఖిల్, రాకేష్, నిఖిల్, శంకర్, రాజశేఖర్, రాంబాబు సూర్య లు పాల్గొన్నారు.

 

Tags: World Photography Day in Manthani

Leave A Reply

Your email address will not be published.