ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం

World Toilets Day

World Toilets Day

Date:19/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని మంగళవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి, ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు మున్సిపాలిటిల పరిధిలో బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించడం జరిగిందన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని, ఈ మేరకు చైతన్యవంతులు కావాలని సూచించారు. అలాగే ప్రతి ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మించుకునేలా చైతన్యవంతులుకావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు స్వచ్చంధ సంస్థలు, మేదావులు, విశ్రాంత ఉద్యోగులు, మహిళలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా కోఆర్డినేటర్‌ రవి , ఆర్‌వో రామకృష్ణ, అకౌంట్స్ఆఫీసర్‌ మనోహర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సఫ్ధర్‌, దళితనాయకులు అశోక్‌, రాజా తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీల లబ్ధిదారుల ఎంపిక

Tags: World Toilets Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *