శివారు కాలనీలకు “దారుల చింత”

చందాలతో గుంతలు పూడ్చుకుంటున్న కాలనీ వాసులు

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 22వ వార్డులో గల శిల్ప నగరం లో శివారు కాలనీల్లో అడుగు వేయాలంటే అవస్థ పడాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనుల కోసం లక్షలు కేటాయిస్తున్నామని చెబుతున్న శివారు కాలనీ అయిన శిల్ప నగరు పరిస్థితి బాగు పడటం లేదని స్థానికులు వాపోతున్నారు. శిల్పా నగరంలో దాదాపు 2000  వేల మంది జనాభా నివసిస్తున్నారు. ఈ కాలనీలో కొన్ని వీధుల్లో  అడుగు తీసి అడుగు వేయాలంటే సహసం చేయాల్సిందే. ఈ కాలనీ 13 ఏళ్ల క్రితం ఏర్పాటు అయిందని తెలిపారు . కర్నూలు – కడప నేషనల్ హైవే ఆనుకుని ఉన్నా సిమెంట్ దారులు వేయలేదన్నారు . అధిక వర్షం కురిస్తే మోకాళ్ల లోతు నీరు పారుతుంటాయి  రోడ్ల పై రోజులు తరపడి నీళ్లు నిల్వ ఉంటున్నాయి. శిల్పా నగరంలో నేటికీ మట్టి రోడ్లే దిక్కయ్యాయి.  రోడ్డు సరిగ్గా లేక అత్యవసరానికి అంబులెన్స్ రాక రెండు మూడు మరణాలు కూడా సంబవించాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు . ఈ రోడ్ల పరిస్థితి చూడలేక కాలనీ వాసులు కమిటీని ఎన్నుకున్నారు.  కమిటీ వారు ఇంటింటికీ తిరిగి  చందాలు వసూలు చేసి గుంతలు పూడ్సు కొంటున్నామని తెలిపారు . కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాది చివారు కాలనీ అని అధికారులు గానీ  ఎమ్మెల్యే గాని కనీసం వార్డు కౌన్సిలర్ కూడా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై స్పందించి కలెక్టర్ గారు కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరారు .

 

Tags: “Worry of Lanes” for Suburban Colonies

Leave A Reply

Your email address will not be published.