ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే బిజెపితో పొత్తుకోసం ఆరాటం

Worrying for a tie-up with the BJP while fighting for special status

Date:12/03/2018

పలమనేరు ముచ్చట్లు:

నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వైకాపా కేంద్ర ప్రభుత్వం పై పోరాడుతూనే బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి ఆరాట పడుతోందంటూ జిల్లా తెదేపా కోశాధికారి ఆర్వీబాలాజీ అన్నారు. సోమవారం స్థానిక తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాకోసం చేస్తున్న పోరాటం ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా లేక కేంద్ర ప్రభుత్వంపైనా తేల్చుకోవాలన్నారు. జగన్ తీరువల్లే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. బిజెపి నే నమ్ముతాం, బిజెపినే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఒక ప్రముఖ జాతీయ చానల్ లో ప్రకటించడంలో ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 29 పర్యాయాలు డిల్లీ వెళ్లారని ప్రత్యేక హోదా, పరిశ్రమల కోసం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని తెలిపారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 18 హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలంకావడంతో తెదేపా బహిరంగ పోరాటానికి సిద్దపడిందని పేర్కొన్నారు. వైసీపీ నిజంగా హోదా కోసం పోరాటం చేస్తుంటే 2019 ఎన్నికల తర్వాత బిజెపితో కలిసేది లేదని ఇప్పుడే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ చాంద్ భాషా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బ్రహ్మయ్య, పెద్దపంజాణి ఎంపీపీ మురళీకృష్ణ, నాయకులు మల్లీశ్వర్ రెడ్డి, తాతయ్య నాయుడు, అమానుల్లా, ముబారక్, కోటి, గాలి సుబ్రమణ్యం నాయుడు, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Worrying for a tie-up with the BJP while fighting for special status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *