Natyam ad

శివాలయంలో వైభవంగా పూజలు

చౌడేపల్లె ముచ్చట్లు:
 
మండలకేంద్రంలోని బజారు వీధిలో వెలసిన శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో సోమవారం వైభవంగా ప్రత్యేక పూజలు జరిగాయి. వేదపండితులైన రాజశేఖర ్యధీక్షితులు, కుమారస్వామి, మహేష్‌స్వామిల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకాలు, పూజల అనంతరం సుందరంగా అలంకరణ చేశారు. పూజా కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వీరికి నిర్వాహకులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Worship in glory at the Shiva temple