పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని బ్రాహ్మణవీధిలో గల శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఈనెల 20 నుంచి స్వామివారి 353వ వార్షిక ఆరాధన ఉత్సవాలు నిర్వహించనున్నారు. గురువారం హరిహరబ్రాహ్మణ యువజన సంఘ నాయకులు రాజేష్, పవన్ లు మాట్లాడుతూ 22 వరకు మూడు రోజులు పాటు జరిగే ఆరాధన ఉత్సవాలలో ఉదయం పంచామృతాభిషేకం, అలంకరణ, పూజ తో పాటు మధ్యాహ్నం ప్రసాద వినియోగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఆరాధన ఉత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులుకావలెనని కోరారు.
Tags;Worship of Sri Raghavendraswami on 20th at Punganur