Natyam ad

కల్వకుర్తిలో దారుణం

-కన్నతల్లినే కడతేర్చిన కోడుకు

 

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

Post Midle

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో దారుణం చోటుచేసుకుంది…కన్న తల్లిని కొడుకే దారుణంగా గొంతు నమిలి హత్య చిన్న సంఘటన కల్వకుర్తిలో చోటుచేసుకుంది…పట్టణంలోని  విద్యానగర్లో తన కొడుకు
రమేష్ తో కలిసి బంగారమ్మ ఓ అద్దె ఇంట్లో ఉంటు జీవనం సాగిస్తుంది… తాగుడుకు బానిసైన తన కొడుకు రమేష్ తరచు తల్లి బంగారమ్మతో గొడవ పడుతుండేవాడు, ఇదే క్రమంలో క్షణికావేశానికి లోనైనా
రమేష్ తన తల్లిపట్ల కాలయముడిగా మారి తల్లి గొంతుకు మొలతాడు చుట్టి నులిమి దారుణంగా చంపాడు. రమేష్ కు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అన్ని తానై తల్లి బంగారమ్మ రమేష్ ను పెంచి
పోషించి, చివరకు తన కొడుకు చేతిలోనే హత్యకు గురి కావడంతో స్థానికులు విషాదం వ్యక్తం చేస్తున్నారు.  విషయం తెలుసుకున్న  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని
దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

 

Tags:Worst in Kalvakurti

Post Midle