పోలవరంలో దారుణం

Date:01/06/2020

ఏలూరు ముచ్చట్లు:

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను ఆమె పుట్టింట్లోనే కేబుల్ వైరుతో ఉరేసి చంపేశాడో కిరాతక భర్త. పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామానికి చెందిన వాకాటి నాగ దుర్గాదేవి(29)కి 2009లో ఉండ్రాజవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వాకాటి సురేశ్‌తో వివాహమైంది. కొద్దిరోజులు భార్యతో సఖ్యతగానే ఉన్న సురేశ్ ఆరు నెలల తర్వాత ఆమె పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు. దీంతో నాగదుర్గాదేవి పుట్టింట్లోనే ఉంటూ తల్లితో కలిసి కూలిపని చేసుకుంటూ జీవిస్తోంది.గతేడాది నుంచి అత్తారింట్లోనే ఉంటున్న సురేశ్ తాగుడుకు బానిసయ్యాడు. మద్యం డబ్బుల కోసం నిత్యం భార్యను వేధించేవాడు. ఆదివారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవపడ్డాడు. ఆవేశంలో ఫోన్ ఛార్జింగ్ వైరుతో భార్య మెడను బిగించాడు. దీంతో దుర్గాదేవి గిలాగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు పోలవరం పోలీసులు సురేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనాస్థలాన్ని పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు పరిశీలించి వివరాలు సేకరించారు. దుర్గాదేవి హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అన్ లాక్ పై కేంద్రాన్ని తప్పుపట్టిన పీకే

Tags: Worst in Polavaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *