Natyam ad

ఆహా ఏమి రుచి. 

-భోజన ఏర్పాట్ల ను పరిశీలించిన తిరుపతిఎంఎల్ఎ ..
-పసందైన వంట కాలపై సంతృప్తి వ్యక్తం చేసిన క్రీడాకారులు
 
తిరుపతి ముచ్చట్లు:
 
తిరుపతి నగరపాలక సంస్థ ఆద్వరంలో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 5 నుండి ప్రారంభమైన జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీలు ఈ నెల 9 వరకు కొనసాగనున్నాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుండి 42 జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు విచ్చేసిన క్రీడాకారులకు తిరుపతి నగరపాలక సంస్థ శ్రీనివాసం, విష్ణునివాసం లో వసతి సౌకర్యం కల్పించడం జరిగిందని, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన క్రీడాకారులు తగిన వసతి కల్పించడంలో రాష్ట్రాల వారీగా లైజాన్ ఆఫీసర్ల నియామకం చేసి వారికి తగిన సదుపాయాలలో ఎటువంటి లోటు లేకుండా అన్ని చర్యలు చేపడుతోంది. క్రీడాకారులు కోవిడ్ నిబందనలను పాటించేలా అవసరమైనన్ని మాస్కులు , స్యానిటైజర్ లు పంపిణీ చేశారు.క్రీడాకారులకు ఏర్పాటు చేసిన వసతి , భోజన సదుపాయాలు ఇతరత్రా ఏర్పాట్లపై తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డా.శిరీషా, కమీషనర్ పి.ఎస్. గిరీషా ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.గురువారం మద్యాహ్నం ఇందిరా మైదానం ఇండోర్ స్టేడియం నందు క్రీడాకారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజనశాలను కరుణాకర్ రెడ్డి పర్యవేక్షించారు. భోజన ఏర్పాట్లపై క్రీడాకారులు తో ఎం ఎల్ ఎ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులందరూ రుచికరమైన వంటకాలతో భోజన ఏర్పాట్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. శుచిగా, శుభ్రంగా, తాజాగా క్రీడాకారులకు భోజన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులను సూచించారు.
 
 
వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన క్రీడాకారులకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించడంలో భాగంగా వారి వారి రాష్ట్రాల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం అల్పాహారం నందు టిఫిన్ లతో పాటు గుడ్డు, పాలు, ప్రతిరోజూ 12 రకాల వంటలు అందిస్తున్నారు. మద్యాహ్న భోజనం నందు శాకాహారం తో పాటు మాంసాహారం ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి భోజన సదుపాయంలో భాగంగా 12 రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేసి అందించడం జరుగుతుంది. ఉదయం అందించే అల్పాహారం 7 గంటల నుండి 11 గంటల వరకు , మద్యాహ్న భోజనం 12.30 నుండి 3.30 వరకు, రాత్రి భోజనం 7 గంటల నుండి 11 గంటల వరకు క్రీడాకారులకు అందుబాటులో ఉంచారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Wow what a taste.