Natyam ad

పుంగనూరులో రచయిత సాల్వరాజు సతీష్‌కు సన్మానం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో ఉన్న రచయిత సాల్వరాజు సతీష్‌కుమార్‌కు బుధవారం ఘన సన్మానం చేశారు. సతీష్‌ రచించిన జయహ్గ పోలీస్‌ అన్న, గురువులకు అక్షరాభిషేకం అనే కథనాలలో పోలీసులు, ఉపాధ్యాయుల విలువల గురించి వివరించి, గుర్తింపు పొందారు. వీటిని ప్రముఖ సాహితివేత్త డాక్టర్‌ వైరాగ్యం ప్రభాకర్‌ రచనలలో ప్రచురించారు. దీనిపై మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి సతీష్‌కుమార్‌కు శాలువకప్పి ,పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్‌ అమ్ము, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Writer Salvaraju Satish honored in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.