ఉపాధ్యాయుల వ్యక్తిగత వివరాలు నమోదు జాగ్రత్తగా చేయాలి

Writing personal details of teachers should be done carefully

Writing personal details of teachers should be done carefully

– సురేంద్రబాబు

 

Date:22/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఉపాధ్యాయులు వ్యక్తిగత వివరాలు నమోదు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎస్టీయు అధ్యక్షుడు సురేంద్రబాబు అన్నారు. బుధవారం పట్టణంలోని కొత్తయిండ్లు హైస్కూల్‌లో ఎస్టీయు డివిజనల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి గత వివరాలతో పాటు ఉపాధ్యాయుల వివరాలు, విద్యార్హతలు, అకౌంట్‌ వివరాలు, పాన్‌కార్డు , సిపిఎస్‌ , జిపిపిఎఫ్‌, ఏపిజిఎల్‌ఐ నెంబర్ల నమోదు చేయాల్సి ఉందన్నారు. ఆన్‌లైన్‌లో ఎలాంటి అజాగ్రత్తలు వహించకుండ చూడాలన్నారు. ఇందుకు సంబంధించి పది రకాల సర్టిపికెట్లను ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ఈ మేరకు ఎలాంటి సందేహాలు ఉన్నా తెలుసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డివిజన్‌ నాయకులు రెడ్డెప్ప, నారాయణ, అయూబ్‌ఖాన్‌, మోహన్‌, మురళి , వెంకటేశ్వర్‌రెడ్డి, శివశంకర్‌, శంకర, బుడ్డన్న, నారాయణస్వామి, వెంకటేశం, సుమిత్ర, దీప, ఖాదర్‌బాషా, మంజునాథ్‌, క్రిష్ణమూర్తి, శ్రీనివాసులు, శ్రీధర్‌, సుధాకర్‌, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.

 

పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Writing personal details of teachers should be done carefully

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *